పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించిన మంత్రి

జనసాక్షి :నెల్లూరులో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖా మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి., కలెక్టర్ ఎం. హరి నారాయణన్, ఎస్పీ తిరలేశ్వ రరెడ్డి, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ పొట్లూరి స్రవంతి, MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోలీస్ అధికారులు,పోలీస్ అమర వీరుల కుటుంబాలు కలసి పోలీస్ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, కలెక్టర్ ఎం. హరి నారాయణన్, ఎస్పీ తిరుమలేస్వర రెడ్డి, తదితరులు . అమరవీరుల గౌరవార్థం సెల్యూట్ చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అ
నంతరం జిల్లాలోని అమరులైన 18 పోలీస్ కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేశారు.
What's Your Reaction?






