అమరవీరుల సమస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్. జగన్

Oct 21, 2023 - 13:10
 0  106
అమరవీరుల సమస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్. జగన్

- ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

- పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి. 

- అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం.

-పోలీస్‌ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.

-ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....

పోలీసు అమరులను స్మరించుకునే రోజు...

ఈ రోజు విధినిర్వహణలో అమరులైన పోలీసు త్యాగాలను స్మరించుకునే రోజు. దేశ ప్రజలంతా కూడా మన పోలీసులను మనసులో సెల్యూట్‌ చేసే కమామ్‌రేషన్‌ డే సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి సంవత్సరం అక్టోబరు 21 వ తారీఖున పోలీసుల అమరవీరుల సంస్మరణదినోత్సవం దేశమంతా జరుపుకుంటుంది. 

కరణ్‌ సింగ్‌ స్ఫూర్తిగా...

1959 అక్టోబరు 21 న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్‌ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఆమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటాం. గడిచిన సంవత్సర కాలంలో ఇలా దేశ వ్యాప్తంగా అమరులైన 188 పోలీసులు అందరికీ నా శ్రద్ధాంజలి. 

ఖాకీ డ్రెస్‌ అంటేనే త్యాగనిరతి...

ఈ ఏడాది మన రాష్ట్రంలో విధినిర్వహణలో ప్రాణం ఒదిలిన పోలీసు సోదరుల కుటుంబాలకు మనందరి ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా, తోడుగా ఉంటుందని మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తున్నాను. సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీసు. 

ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగ నిరతి. ఆ డ్రెస్‌ మీద ఉన్న మూడు సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదు. అంతకుమించి పోలీస్‌ అంటే ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్‌. మరీ ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు విలువ ఉంటుంది. 

కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి...

ఈ రోజు కొత్త టెక్నాలజీ వల్ల సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సైబర్‌ సెక్యూరిటీ నుంచి డేటా థెప్ట్‌ వరకు, డేటా థెప్ట్‌ నుంచి సైబర్‌ హెరాస్‌మెంట్‌ వరకు ప్రతి అంశంలోనూ నేరాలన్నీ నిరోధించడానికి, వాటి మీద దర్యాప్తు చేసి శిక్షవేయడానికి పోలీసులు ఎంతగానో అప్‌డేట్‌ కావాల్సిన యుగంలో మనమంతా ఉన్నాం. 

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ వాడకం వల్ల సైబర్‌ ప్రపంచంలో మరో చీకటి ప్రపంచం సృష్టించుకుని నేరాలు చేస్తున్నవాళ్లను ఎదుర్కొవాల్సిన ఒక బృహత్తర బాధ్యత కూడా ఇవాళ పోలీసుల భుజస్కంధాల మీద మరింతగా వచ్చిపడింది. రకరకాల నేరాలతో పాటు కొత్త టెక్నాలజీని అనూహ్యంగా వాడుకుని విజృంభించే అసాంఘిక శక్తులు విసిరే సవాళ్లకు ఎప్పటికప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.

హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీలు, డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ మారుతున్న ఈ సమాజం విసురుతూ ఉన్న కొత్త సవాళ్లకు సమాధానం చెప్పడానికి మనందరి సిద్ధం కావాలి. నేర నిరోధం, నేర దర్యాప్తు ఈ రెండింటిలోనూ మన పోలీసులు అత్యాధునిక సైబర్‌ టెక్నాలజీ ఉపయోగిస్తూ దేశంలోనే అగ్రగామిగా ఉన్నారన్న వాస్తవం, ఈ డివిజన్‌లో 130 మంది సాంకేతిక పోలీసింగ్‌ నిపుణులను మన ప్రజల కోసం పనిచేస్తున్న వాస్తవం ప్రజలకు ఎంతో ధైర్యానిస్తుంది.

అసాంఘిక శక్తులను రీడిఫైన్‌ చేయాల్సిన సమయం..

ఇదే సమయంలో అసాంఘిక శక్తులనే పదాన్ని మనం రీడిఫైన్‌ చేయాల్సిన అవసరం ఇటీవల జరిగిన అనేక సంఘటనలు చూసినప్పుడు మనందరికి కూడా ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రజాజీవనాన్ని తమ స్వార్ధం కోసం దెబ్బతీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే. ప్రభుత్వం మీద, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలనుకునే ఇలాంటి శక్తులన్నీ కూడా అడవుల్లోనో, అజ్ఞాతంలో కాకుండా ప్రజా జీవితంలో ఉంటూ అదే ప్రజాజీవితం మీద దాడిచేయడాన్ని కూడా మనమంతా ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైన పరిస్థితులను చూస్తున్నాం. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, పత్రికాస్వేచ్ఛ లాంటి పదాలకు అర్ధం అంటే.. ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని పోలీసుల నుంచి న్యాయస్ధానాల నుంచి లాగేసుకోవచ్చు అని కాదు. మొన్ననే మనమంతా చూశాం. నూజివీడులో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్‌ను చంపారు. మన కళ్లెదుటనే జరిగిన సంఘటనలు ఇవన్నీ.

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ....

అంగళ్లలో సాక్షాత్తూ ప్రతిపక్ష నాయకుడు తన పార్టీవాళ్లను రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడం, ఆ తర్వాత పుంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాలే చివరకి ఒక పోలీసు సోదరుడి కన్ను పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి, అవినీతి, నేరాలు చేస్తే.. ఆ పైన ఆధారాలు అన్ని చూసిన పిమ్మట న్యాయస్ధానాలన్నీ వీరికి అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి.. చివరకి ఆ న్యాయమూర్తుల మీద ట్రోలింగ్‌ చేస్తారు. వారికి సంబంధించిన టీవీ ఛానెళ్లలో డిబెట్లు నడుపుతారు. తమను ఎవరూ కూడా ఏం చేయలేరన్న అహంకారంలో ఇవన్నీ చేస్తుంటారు. ఇటువంటివి అన్నీ యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌ చేసే పనులే తప్ప.. ప్రజాస్వామ్యం మీద కానీ, రూల్‌ ఆఫ్‌ లా మీద కానీ నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావు. 

దుర్మార్గుల పని పట్టండి....

తమ స్వార్ధం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్‌రెస్ట్‌ క్రియటే చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టానికి పని పెట్టండని, ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద దాడి చేసే ఇటువంటి దుష్టశక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుందన్నది కూడా మనమంతా ఆలోచన చేయాల్సిన విషయం.

మన ప్రభుత్వం– పోలీసు సంక్షేమం....

ఇక మనందరి ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంక్షేమం గురించి ఏ రకంగా అడుగులు వేశామన్నది నాలుగు మాటల్లో చెబుతాను.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 16వేల మంది మహిళా పోలీసులను ఈ నాలుగేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో మనందరి ప్రభుత్వం నియమించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ తీసుకునివచ్చాం. దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం, ప్రతి జిల్లాలో దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించడం ఇలా అక్కచెల్లెమ్మల మీద వారి భద్రత మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థి

దిశ యాప్‌...

ఒక్క దిశ యాప్‌ మన రాష్ట్రంలో 1.25 కోట్ల మంది అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో రిజిస్టర్‌ అయింది. ఈ యాప్‌ వల్ల ఆపదలో ఉన్న దాదాపు 31,200 మంది అక్కచెల్లెమ్మలు ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కడం వల్లనో, ఫోన్‌ గట్టిగా షేక్‌ చేయడం వల్లనో.. పోలీసులు అక్కడికి చేరుకుని భద్రత కల్పించిన పరిస్థితి మన రాష్ట్రంలోనే, మన పోలీసుల ఆధ్వర్యంలో జరిగిందని చెప్పడానికి మీ ముఖ్యమంత్రిగా గర్వపడుతున్నాను. 

మరిన్ని అడుగులు వేస్తూ– పోస్టుల భర్తీ.

పోలీసులకు ఇంకా మంచి చేయాలని అడుగులు వేస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా వీక్లీఆఫ్‌ కాన్సెఫ్ట్‌ను తీసుకొచ్చే అడుగు మన ప్రభుత్వంలోనే పడింది. పోలీసుల మీద ఒత్తిడి తగ్గించేందుకు అదనంగా పోలీసుల నియామకం చేయాల్సిన అవసరం ఉందని తెలిసి.. గ్రామస్ధాయిలో 16వేల మహిళా పోలీసులను నియామకం చేయడమే కాకుండా.... మరో దాదాపు 6,500 పోస్టులను భర్తీ చేసేందుకు (6,100 కానిస్టేబుల్‌ పోస్టులు, 450 ఎస్సై పోస్టులు) మన ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులు వేగంగా పడ్డాయి. దురదృష్టవశాత్తు ఈ విషయం కోర్టుల వరకు వెళ్లి కాస్తా జాప్యం జరుగుతున్న నేపధ్యంలో.. ఈ సందర్భంగా డీజీపీ గారికి, పోలీసు ఉన్నతాధికారులకు ఒక్కటే విన్నవిస్తున్నాను. త్వరితగతిన ఈ విషయంలో కోర్టుల్లో ఒక పరిష్కారం తీసుకొచ్చి ఈ నియామక ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా పూర్తి చేయాలని మీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.

రాష్ట్రంలో ఇప్పటికే 4 ఐఆర్‌ బెటాలియన్లను తీసుకొచ్చాం. దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా.. కరోనా వల్ల దాదాపు 201 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతే... ఏ రాష్ట్రంలోనూ ఎవరూ ఆదుకోనంతగా.. వారి కుటంబాలను ఆదుకుంటూ... రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా.. ఎస్‌బీఐ వంటి సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కూడా ఏకం చేసి రూ.17 లక్షలు ఒక్కో కుటుంబానికి ఆర్ధిక సాయం చేసి తోడుగా నిలబడ్డాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow