విజయవాడ కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

Oct 21, 2023 - 04:40
 0  41
విజయవాడ కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

జన సాక్షి  :

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సీఎం వైఎస్. జగన్  మోహన్ రెడ్డి విజయవాడ  కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రజల తరపున  పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమను  సమర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  సీఎం  వైఎస్ .జగన్‌కు పూర్ణకుంభంతో  ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.దుర్గమ్మకు రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించి, అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు.అనంతరం సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి తీర్ధ, ప్రసాదాలు, చిత్రపటం  అర్చకులు అందించారు. ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం ఈవో కే ఎస్ రామారావు.హోంశాఖ మంత్రి తానేటి వనిత, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కర్నాటి రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow