పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి- ఇంటూరి నాగేశ్వరరావు

Oct 29, 2024 - 12:27
 0  11
పోలీసు అమరవీరుల త్యాగాలు  మరువలేనివి- ఇంటూరి నాగేశ్వరరావు
కందుకూరు జనసాక్షి : పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరారవు అన్నారు. సోమవారం కందుకూరు పట్టణంలోని శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. దేశం కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగాలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను గౌరవించడం మన కర్తవ్యంగా ప్రతి పౌరుడు భావించాలని కోరారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్పదని అన్నారు. రక్త దానం చేయటం వల్ల ఆపదలో ఉన్న మరో ప్రాణాన్ని రక్షించే అవకాశం మనకు లభిస్తుందని తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఏర్పాటు చేయడం అభినందనీయం పేర్కొన్నారు. రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 117 మంది రక్తదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కందుకూరు డీఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం కందుకూరు రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ చెన్నా వెంకట రామాంజనేయులు ఆధ్వర్యంలో కావలి రెడ్ క్రాస్ వారి సహకారంతో జరిగింది. కందుకూరు సీఐ వెంకటేశ్వరరావు, గుడ్లూరు సీఐ మంగారావు, టౌన్ ఎస్పై సాంబశివయ్య, రూరల్ ఎస్సై మహేంద్రనాయక్, గుడ్లూరు ఎస్పై వెంకటరావు, ఉలవపాడు ఎస్పై అంకమ్మ, వలేటివారిపాలెం ఎస్పై మరిడి నాయుడు, లింగనముద్రం ఎస్సై, పోలీస్ సిబ్బంది, టీడీపీ నాయకులు జి. మోషె, వివేక, గాయత్రి కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow