ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని జయించండి

ఆత్మ విశ్వాసంతో వైకల్యాన్ని జయించండి
దివ్యాంగుల జీవితాలు మెరుగు పరిచేందుకై కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంపోజిట్ రీజినల్ సెంటర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం ఎంపిడిఓ కార్యాలయంలో CRC ఆధ్వర్యంలో ఆమె దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ మరియు వినికిడి పరికరాలు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో 3 వేల రూపాయలుగా వున్న పెన్షన్ 6 వేలకు పెంచారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ మేధో వైకల్యం వ్యక్తుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో వెంకటాచలం లోని CRC సెంటర్ లో యిచ్చే నైపుణ్య శిక్షణను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగుల కోసం విపిఆర్ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందన్నారు. దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరు మానవతా దృక్పధంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సూచించారు. ఆత్మ విశ్వాసంతో అంగ వైకల్యాన్ని జయించాలని ఆమె దివ్యాంగులను కోరారు. ఈ కార్యక్రమంలో CRC అధికారులతో పాటు బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివ కుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, ఎంపిడిఓ శ్రీహరి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, బుచ్చి పట్టణ కౌన్సిలర్లు మరియు బుచ్చి పట్టాణ టిడిపి నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?






