పేదలకు ఆరోగ్యశ్రీ వరం
పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం
- ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం.వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది.గతంలో రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదు.ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం.
రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 513 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం
ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నాం
ఇవాళ్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ
క్యూఆర్ కోడ్‌తో కార్డులో లబ్ధిదారుని ఫొటో, ఇతర వివరాలు
ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలి
రాష్ట్రంలోని 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు
ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ. 4,100 కోట్లు ఖర్చు చేస్తున్నాం
రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం
పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ప్రణాళిక రూపొందించాం..
What's Your Reaction?






