కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం

Jun 2, 2024 - 22:41
Jun 2, 2024 - 22:44
 0  8
కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం

కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం 

 నెల్లూరు జనసాక్షి :

ప్రియదర్శిని కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, కౌంటింగ్ ప్రణాళికాబద్ధంగా జరపటానికి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ శ్రీయం హరి నారాయణన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల వద్ద కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్స్, మీడియా సెంటర్లో చేసిన ఏర్పాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.కౌంటింగ్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 1110మంది,వీరితో కలిపి పోలీస్, హెల్పర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సుమారు మూడు వేల మందిని సిబ్బందిని కౌంటింగ్ ప్రక్రియకు వినియోగిస్తున్నామన్నారు. కౌంటింగ్17హాల్లలోజరుగుతుందని , ఒక్కో హాల్లో 14 టేబుల్స్ ఉంటాయని ఆయన తెలిపారు . కౌంటింగ్ కోసం వచ్చే వారందరి కోసం కళాశాల ఆవరణలో త్రాగునీరు, అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కోసం వచ్చే ఏజెంట్లు, సిబ్బంది అందరికీ జిల్లా పరిషత్ హై స్కూల్లో పార్కింగ్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులు, వారిఏజెంట్లు కళాశాలకు 100 మీటర్ల దూరం వరకు వారి వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ ఫోన్లను పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గది వరకు, మీడియా వారి ఫోన్లను మీడియాసెంటర్ వరకుఅనుమతిస్తారని,కౌంటింగ్ ఏజెంట్ల కోసం కళాశాల గేటు బయట ఏర్పాటు చేసిన డిపాజిట్ కేంద్రంలో వారి ఫోన్ లు భద్రపరుచుకోవాలి అన్నారు. కౌంటింగ్ హాల్ లొకి ఫోన్లు అనుమతించరని చెప్పారు.రాజకీయ పార్టీల ప్రతినిధులకు అభ్యర్థులకు సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు పాటించాలని, కౌంటింగ్ సజావుగా సాగడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. పోలింగ్ జరిగిన తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉన్నామన్నారు.130 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగిందని ముందు జాగ్రత్త చర్యగా పికెటింగ్లు ఏర్పాటు చేసి , మొబైల్ పార్టీలు గ్రామాలలో తిరుగు తున్నాయన్నారు . ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడిన చట్టప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మూడో తేదీ నుండి ఆరో తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నాలుగో తేదీన డ్రై డే గా ప్రకటించామన్నారు. కౌంటింగ్ లో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆర్వో దృష్టి తీసుకు రావాలన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉందని, బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం విధి విధానాలు, నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని కలెక్టర్ కోరారు. 

ఈ పర్యటనలో ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ SDC శ్రీనివాస్ అడిషనల్ కమీషనర్ సర్మద,సిటీ ప్లానర్,AE, తదితరులు ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow