నూతన చర్చి నిర్మాణానికి రూ 1 లక్ష విరాళం

నూతన చర్చి నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం...
కందుకూరు మండలం మోపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు రెబ్బవరపు మాల్యాద్రి కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా చర్చి నిర్వాహకులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా చర్చి నిర్మాణానికి లక్ష రూపాయలు అందజేసిన రెబ్బవరపు మాల్యాద్రిని ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు ఇతర నేతలు పాల్గొన్నారు.
What's Your Reaction?






