సముద్ర స్థానానికి వెళ్లి ముగ్గురు మృతి

సింగరాయకొండ మండలం పాకల సముద్ర స్థానానికి వెళ్లిన పొన్నలూరు మండలం తిమ్మపాలెం పంచాయతీ శివన్న పాలెం గ్రామానికి చెందిన నోసిన మాధవ (25), నోసిన జెస్సికా (16), కందుకూరు మండలం కొల్లగుంట గ్రామానికి చెందిన కొండా బత్తిని యామిని (19), సింగరాయకొండ కు చెందిన ఒకరు గల్లంతు కాగా, మృతుడు మాధవ భార్య నవ్యాను మత్స్యకారులు రక్షించారు, మాధవ హైదరాబాదులో బేలు దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇటీవల కాలంలో నవ్యతో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామానికి వచ్చారు, జెస్సికా మాలపాడు కస్తూరిబా పాఠశాల యందు 8వ తరగతి చదువుతుంది ఆమె తల్లి అంగన్వాడి ఆయాగా పనిచేస్తుంది. వీరు పండగ సందర్భంగా విహారయాత్రకి మాధవ కుటుంబ సభ్యులు తన బంధువులతో పాకాల సముద్ర తీరానికి గురువారం చేరుకున్నారు, వీరు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ఐదుగురు గల్లంతయ్యారు గమనించిన స్థానికులు కేకలు వేయడంతో మత్యకారులు రక్షించేందుకు ప్రయత్నించారు వీరులో ఒకరు రక్షించగా ముగ్గురు మృతి చెందారు గల్లంతయిన వ్యక్తి ఆచికి కోసం మెరైన్ పోలీసులు మత్యకారులు కలిసి గాలిస్తున్నారు. మృతదేహాలను మెరైన్ పోలీసులు కందుకూరి ఏరియా వైద్యశాలకు తరలించారు ప్రమాదవ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ఏరియా వైద్యశాలకి వచ్చి మృతదేహాలను పరిశీలించి ప్రమాద ఘటనను తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చరు. ప్రభుత్వం నుంచి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన ఆయన అన్నారు. ఆయన వెంట స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు , కందుకూరు పొన్నలూరు టిడిపి నాయకులు మండవ ప్రసాద్, కర్ణ కోటిరెడ్డి, పల్లపోతు రమేష్, కొండ్రగుంట శ్రీనివాసరావు, పల్లపోతు ప్రసాద్, మండవ మురళి, గట్టు బోయిన మల్లికార్జున, మోరుబోయిన మాల్యాద్రి, అనుమెల సుధాకర్ ఉన్నారు
What's Your Reaction?






