పేద నాయి బ్రాహ్మణ కళాకారులకు డోలు, నాదస్వరం బహుకరణ

Mar 5, 2024 - 14:41
Mar 5, 2024 - 14:49
 0  548
పేద నాయి బ్రాహ్మణ కళాకారులకు డోలు, నాదస్వరం  బహుకరణ

కందుకూరు జనసాక్షి  : పేద నాయి బ్రాహ్మణ కళాకారులకు, తల్లిదండ్రులు లేని కళాకారుల పిల్లలకు  డోలు నాదస్వరం బోకరిస్తున్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  వైయస్సార్ సీ పీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వల్లూరి. కోటేశ్వర రావు.  ప్రతి సంవత్సరం లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం సందర్భంగా పాకల గ్రామంలో కీర్తిశేషులు వల్లూరు బాలకోటయ్య శేషమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు వల్లూరు సాంబశివరావు వల్లూరి కోటేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం నాయి బ్రాహ్మణ పిల్లలకు ఉచితముగా నాదస్వరం డోలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా లాయర్ వసంతలక్ష్మి మాట్లాడుతూ పేద పిల్లలు నాయి బ్రాహ్మణులు ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే మేము వారికి ఫీజులు గాని, బట్టలు పుస్తకాలు ఉచితంగా అందిస్తామని తెలిపారు  ,  కొత్తకోట వెంకటరావు, సుశీల దంపతులు ఈ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాకల శ్రీహరి, కొత్తకోట శ్రీనివాసులు, పాకల నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొని జయప్రదం చేశారు.  అనంతరం  భారీ అన్నదానం నిర్వహించారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow