నంద్యాల జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌

Apr 15, 2024 - 13:06
Apr 15, 2024 - 13:17
 0  150
నంద్యాల జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌

నంద్యాల జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌

టీడీపీ నేత, రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరే

షన్‌, హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అహ్మ‌ద్ హుస్సేన్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

 జనసాక్షి  :నంద్యాల జిల్లాలో తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అహ్మ‌ద్ హుస్సేన్ వైసీపీ   గూటికి చేరారు. కేసరపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద  ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో అహ్మ‌ద్ హుస్సేన్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలాగే  టీడీపీ అఫీసియల్‌ స్పోక్స్‌ పర్సన్‌ ముస్తాఫా మొమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్‌ మహమ్మద్, మహమ్మద్‌ ఇలియాస్‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు విజయం సిద్ధించాలని, ఎలాంటి ఆటంకాలు రాకూడదని ముఫ్తీ నూర్‌ మహమ్మద్ దువా చేశారు. కార్యక్రమంలో శ్రీశైలం, క‌ర్నూలు ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, హాఫిజ్‌ఖాన్ పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow