అంకమ్మ తల్లి కిరీటానికి విరాళం ప్రకటించిన విజయసాయిరెడ్డి

-అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తా
-అమ్మవారి కిరీటానికి విరాళం ప్రకటన
-నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి
కందుకూరు జనసాక్షి:కందుకూరు ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి తన వంతు సాయం చెస్తానని నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. సోమవారం కందుకూరు పట్టణంలోని అంకమ్మ తల్లి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మదుసూదన్ యాదవ్ గారితో కలిసి విజయసాయి రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్మావారి ఆశీస్సులు కోసం ఈ రోజు దర్శించుకొన్నామన్నారు.. ప్రాచీనశిల్పకళా సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. నేను ఎదో అశించి కాకుండా నా వంతగా అమ్మావారి కిరీటం కోసం విరాళం అందిస్తానని చెప్పారు.అలాగే అంకమ్మ తల్లి దేవస్థానం ఆలయ అభివృద్ధి కోసం అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మదుసూదన్ యాదవ్ కూడ విరాళం ప్రకటించారు.ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
What's Your Reaction?






