వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసల పర్వం

Apr 19, 2024 - 16:07
Apr 19, 2024 - 16:10
 0  626
వైఎ స్సార్  కాంగ్రెస్ పార్టీలోకి  కొనసాగుతున్న వలసల పర్వం

తెలుగుదేశం నుంచి  వైసీపీ లో కి భారీగా కొనసాగుతున్న వలసలు 

-పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికిసముచిత స్థానం కల్పించబడుతుంది

  - వైసిపి ఎమ్మెల్యే  అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్

 జనసాక్షి  :  నెల్లూరు జిల్లా కందుకూరు పామూరు  రోడ్ లోని వైసీపీ   కార్యాలయంలో బుర్రా మధుసూదన్ యాదవ్ సమక్షంలో ఉలవపాడు మండలం కొల్లూరుపాడు గ్రామం ఎస్సీ కాలనీ వాసులు భారీగా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో   చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు   మాట్లాడుతూ జగనన్న ఎస్సీలు పట్ల చూపుతున్న ఆదరాభిమానాలు, ఎస్సీలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి తోపాటు పరిపాలనలో నామినేటి పదవుల్లో భాగస్వామ్యం చేస్తున్న తీరును చూసి  తెలుగుదేశం పార్టీ వీడి వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు. ఎస్సీలు పట్ల ప్రేమ భావం కలిగిన సహోదరుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపుని మేము ఆకాంక్షించి పార్టీలో చేరుతున్నామని తెలిపారు .  బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ నా పట్ల మీరు చూపుతున్న ఆదరాభిమానాలకు ముగ్ధున్నీ అవుతున్నానని, ఇదే ప్రేమాభిమానాలను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి పట్ల చూపించాలని విజయ సాయి రెడ్డికి, నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగనన్న అందించిన సంక్షేమం సుపరిపాలన అభివృద్ధి పేదలందరి జీవితాల్లో వెలుగు నింపిందని, అవి కొనసాగాలంటే జగనన్న తిరిగి మరలా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగుదేశం వీడి వైసీపీలో   చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి   హృదయపూర్వకంగా వైఎస్సార్     కుటుంబంలోనికి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇస్తామని   పేర్కొన్నారు.. తెలుగుదేశం వీడి వైసీపీలో చేరిన వారిలో ఎం. రాజేష్,జొన్నలగడ్డ లక్ష్మీ,   కోడూరి అన్నపూర్ణ, కోడూరు అశ్విత, మామిడి సుబ్బమ్మ ఈశ్వరమ్మ,, మామిడి ఈశ్వరమ్మ గద్దల సునీల్, గద్దల మోహన్ కోడూరి సౌజన్య, కోడూరు యలమంద,సౌపాటి సంగీత,పి నాగమ్మ,, టీ కార్తీక్, రాయపాటి కోటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో  వైసీపీ   మండల పార్టీ అధ్యక్షులు ఎన్. పోతురాజు, మండల నాయకులు కోటు కోటి లింగం, సుధాకర్, పార్టీ సీనియర్ నాయకులు కొండూరి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow