దేశ ప్రధానిని కలిసి ఎంపీ వేమిరెడ్డి దంపతులు
దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని శాలువాతో సత్కరించారు. అనంతరం పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా పలకరించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోడీ గారికి వేమిరెడ్డి దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. నరేంద్ర మోడీ గారి సారధ్యంలో దేశం మరింత పురోగమిస్తుందని వారు పేర్కొన్నారు. దేశాన్ని అగ్రపథాన నిలుపుతున్న ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై వేమిరెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.