కమనీయం.. కార్తీక మాస లక్ష దీపోత్సవం
నెల్లూరు :జనసాక్షి
కమనీయం.. కార్తీక మాస లక్ష దీపోత్సవం
రెండో రోజు సాయంత్రం దీపాలు వెలిగించిన భక్తజనం
అనుగ్రహ భాషణం అందించిన శ్రీ విద్యారణ్య స్వామి
వీపీఆర్ ఫౌండేషన్ అధినేత, వైసీపీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగారు, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగారు, కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన నాట్యం చూపరులను అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, కమిషనర్ వికాస్ మర్మట్ గారు, విజయ డైరీ ఛైర్మెన్ రంగారెడ్డి గారు తదితరులు హాజరయ్యారు. ముందుగా శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధీశులు, శ్రీ మత్ పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామిగారు అనుగ్రహ భాషణం అందించారు బ్రిటిష్ వారి రాకతో సనాతన ధర్మం అవస్థలు పడిందన్నారు. సనాతన ధర్మంతో నే భారతదేశం ప్రపంచం లో మేటి గా ఉందన్నారు. నాటి ఆచార వ్యవహారాలు చాలా గొప్పవని అన్నారు. వీటి ఆధారంగానే విదేశీ శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలుగా చెప్పుకొన్నారని అన్నారు. సనాతన ధర్మం లో దీపానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మహర్షులు సూచించిన విధానాలతోనే ముక్తి సాధ్యమని చెప్పారు. అనంతరం అశేష భక్తజనుల మధ్య కార్తీక దీపాల వెలుగుల్లో శ్రీ కృష్ణ భగవాన్ కు నవనీత సేవ చేశారు. వెన్నతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష అర్చన, హారతులు ఇచ్చారు. ఈ సేవను చూసిన భక్తులు తన్మయత్వం పొందారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
What's Your Reaction?






