నిజమైన భూ యజమానుల కోసమే రెవెన్యూ సదస్సులు

నిజమైన భూ యజమానుల కోసమే రెవెన్యూ సదస్సులు
-రెవెన్యూ సదస్సు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
-సదస్సులో వచ్చిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలి
లింగసముద్రం మండలం పెంట్రాల పంచాయతీలో జరిగే రెవిన్యూ సదస్సులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ కూడా పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిజమైన భూ హక్కుదారుల కోసమే మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు..మీ భూమి మీ హక్కు కార్యక్రమం పేరుతో డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు..గత వైసీపీ ప్రభుత్వంలో రీ సర్వే పేరట రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ముఖ్యంగా లింగసముద్రం మండలంలో వైసిపి నాయకులు పేదల భూములు ఆన్లైన్లో ఎక్కించుకోవడం లాంటి చాలా సమస్యల ద్వారా రైతులను ఎంతో ఇబ్బంది పెట్టారని విమర్శించారు.రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు అధికారులు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, లింగసముద్రం మండల గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
What's Your Reaction?






