గొట్టిముక్కల నాసరయ్యకు శ్రీ శ్రీ కళా వేదిక సత్కారం

- 124 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్న సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్య
- శ్రీ శ్రీ కళావేదిక సాహిత్య సేవలు ప్రశoసనీయం
- డాక్టర్. కత్తిమండ ప్రతాప్ సాహిత్య సేవలు అద్భుతం
జనసాక్షి త్రిపురాంతకం :
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్య సోమవారం అంతర్జాతీయ గుర్తింపు పొందిన సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవ సంస్థ, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ రాధా సుందర కళ్యాణ వేదికలో ఘనంగా కవితోత్సవం నిర్వహించారు, ఈ కవి సమ్మేళనంలో గొట్టిముక్కుల నాసరయ్య పాల్గొని కవితాగానం చేసి తెలుగు భాష, సంస్కృతి - సంప్రదాయాల అభివృద్ధికి సాహిత్యం ద్వారా కృషి చేస్తున్నందుకు సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్యను అభినందిస్తూ జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించి అందిస్తున్న ప్రశాంసాపత్రంమని శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం మరియు పల్నాడు జిల్లా అధ్యక్షురాలు డా. శాంతా భాయ్, రాష్ట్ర కార్యదర్శి గుండాల రాకేష్ తదితరులు తెలిపారు.
What's Your Reaction?






