చిన్నారి పొన్నారి ఆశాదీపం

జనసాక్షి : చిన్నారి పొన్నారి
ఆశా దీపం
అందాల అపురూప శిల్పం
మా ముంగిట్లో
వెలసిన బుజ్జి మహాలక్ష్మీ
ఇంద్రధనుస్సు వన్నెల చిన్నారి
చిట్టి పొట్టి సొగసుల వయ్యారి
కోరుకున్నాం కోనేటిరాయణ్ణీ
ఏరి కోరి పొందాము బంగారిని
అమాంతం కట్టి పడేసే నీరూపం
అమ్మానాన్నలకు అది ప్రతిరూపం
నువ్వే మా కనులరూపం
కమ్మనైనా నీపిలుపే మాకు అమృతం
వరాల జల్లుల చిన్ని కిన్నెర
లేక్షనీయమైనా నీ నవ్వే చాలురా
బుడి బుడి అడుగులతో రారా
చిన్ని కన్నా మా అదృష్టం నువ్వేరా
ఇంతలోనే ఎంతజ్ఞానమురా తల్లి
అంచెలంచెలుగా ఎదగాలిరా తల్లి
మా అమ్మవు నీవు
మా అల్లరి నీవు
మా ఆనందం నీవు
మా చిరునవ్వు నీవే
అందుకోరా
హ్యపీ హ్యాపీ బర్త్ డే లు
నీకు శతకోటి శతాయిష్మాన్ భవ
జన్మదిన శుభాకాంక్షలు
What's Your Reaction?






