క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

క్రిస్మస్ పండగ ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
కందుకూరు పట్టణంలోని 25 వ వార్డు ప్రశాంతి నగర్ ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ ను పాస్టర్లతో కలిసి కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏసుప్రభు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాస రావు తదితరులుు పాల్గొన్నారు.
What's Your Reaction?






