క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

కందుకూరు నియోజకవర్గం క్రైస్తవ, సోదర, సోదరీమణులకు నెల్లూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక నాయకులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.కరుణ, క్షమ, ప్రేమ, దయాగుణం ప్రజలకు ఏసుక్రీస్తు తన జీవితం ద్వారా అందించిన మహోన్నత విలువలని అన్నారు. బాధల్ని ఓర్చుకుని తనను నమ్మిన ప్రజల కష్టనష్టాల్లో భాగం పంచుకుని ప్రాణత్యాగం చేసిన ఏసుక్రీస్తు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. కష్టంలోనే విజ్ఞానం వికసిస్తుందన్న సందేశాన్ని ఇచ్చి అందరినీ సన్మార్గం వైపు నడిపించారని చెప్పారు. సాటి మనిషికి చేతనైనంత సాయం, పొరుగువారిపై ప్రేమ, ప్రతికార్యంలోనూ త్యాగం ఆయన చూపిన బాట అని, ప్రతి ఒక్కరూ క్రీస్తు బాటలో పయనించి సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని, ఆయన కృప, కరుణ అందరిపై ఉండాలని ముస్లిం ఐక్యవేదిక నాయకులు ఆకాంక్షించారు.
What's Your Reaction?






