తెలుగుదేశం పార్టీలో చేరిన కాపు మహిళా నేత పద్మావతి శ్రీదేవి

టీడీపీ లో చేరిన పద్మావతి శ్రీదేవి
జనసాక్షి కావలి :కాపు మహిళా నేత, మాజీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మావతి శ్రీదేవి బుధవారం బిజెపి ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఆమె తో పాటు డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ సాయి సుస్మిత, డాక్టర్ వైష్ణవి, భారతి, దిలీప్, విజయ్ కుమార్, మొగిలిశెట్టి పద్మ, పురిణి మాధవి, సుబ్బరత్నమ్మ, లక్ష్మీ, కే. మాధవి, ఆర్. లక్ష్మీ, ఎం. లక్ష్మీ, నిషాంత్, వెంగయ్య చౌదరి, విజయలక్ష్మి, తదితర 20 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరందరికీ కావలి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా పద్మావతి శ్రీదేవి మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావ్య క్రిష్ణారెడ్డి అని, కావలిని అభివృద్ధి చేయగల సమర్ధుడు అని అన్నారు.. కేవలం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో టీడీపీ లో చేరడం జరిగిందన్నారు..
కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ నాపై అభిమానం చూపుతూ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు.. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.. ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, అందరి సహకారంతో కావలి ని అభివృద్ధి పధంలో నడుపుతానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, 18వ వార్డు ఇంచార్జి శానం హరి, తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
What's Your Reaction?






