ఆర్యవైశ్యులకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తాం - విజయసాయి రెడ్డి

ఆర్యవైశ్యులకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తాం
-జగనన్న ప్రజా పరిపాలనలో వాటా ఇస్తాం
-సంక్షేమం,శాంతి భద్రత పరిరక్షణకు మాదే బాధ్యత
-వాసవి నగర్ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీ పీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి. విజయసాయిరెడ్డి
-కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ భరోసా.
కందుకూరు జనసాక్షి : ఆర్యవైశ్యులకు అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పిస్తామని వైసీ పీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కందుకూరు మున్సిపాలిటీ 4 సచివాలయం 7 వార్డు వాసవి నగర్ కాలనీలో వైఎ స్సార్ పార్లమెంట్ అభ్యర్థి, కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రజా పరిపాలనలో అన్ని వర్గాలకు సమస్థానం ఉంటుందని ముఖ్యంగా ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు . కందుకూరు పట్టణం అభివృద్ధితో పాటు శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మాదేనని భరోసా ఇచ్చారు . ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న సంకల్పించిన సంక్షేమ రాజ్యం అందరిని ఆదరిస్తుందని అందులో భాగంగానే సౌమ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్
ను కందుకూరు అభ్యర్థిగా మీ వద్దకు పంపించాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే నెల్లూరు పార్ల మెంట్ కు పోటీ చేస్తున్న నన్ను కూడా ఆశీర్వదించాలని విజ్ఞప్తీ చేస్తున్నాను అని అన్నారు. అదే సందర్భంలో బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ జగనన్న కు సన్నిహితుడు మన పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించటం మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని నిధులు సమకూర్చటంలో, పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో, నియోజకవర్గ సాగు, తాగునీటి సమస్య పరిష్కరించడంలో విజయ్ అన్న సంపూర్ణ తోడ్పాటు ఉంటుందని అందుకే విజయన్నకు మన నియోజకవర్గము నుంచి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, జే సి ఎస్ కోఆర్డినేటర్ ముప్పువరపు కిషోర్, వైసీపీ నాయకులు మురారి శెట్టి శ్రీకాంత్, తాళ్లూరి వెంకటేశ్వర్లు, కందగడ్డ వెంకటేశ్వర్లు, వేముల రాము,తాతా సంపత్, మురళీ, అప్పల మధు,నాగసూరి శ్రీనివాసులు,జాజుల కోటేశ్వరరావు, గణేశం గంగిరెడ్డి, తోకల కొండయ్య, రావులకొల్లు బ్రహ్మానందం, రేణమాల అయ్యన్న, మద్దాలి జగదీష్, నెల్లూరు జిల్లా ఎస్సీ సెల్ జాయింట్ సెక్రెటరీ యర మాల నాగభూషణం, షేక్ హమీద్,చీమకుర్తి కృష్ణారెడ్డి, డిసిహెచ్ మాలకొండయ్య, రావినూతల రాజు,పెయ్యల వెంకట రమణయ్య, గేరా మనోహర్, తానికొండ శ్రీను, దేవి శెట్టి రాజేష్,చనమాల కోటేశ్వరరావు, చనమాల శ్రీధర్,సయ్యద్ నశీర్, షేక్ అసదుల్లా,జమ్మలమడుగు రవి,షేక్ రహీం, పల్నాటి చెన్నయ్య,షేక్ దస్తగిరి, పసుపులేటి వెంకటేశ్, గంధం సన్నీ, జంగిలి ఏసేబు, ఉచ్చులూరి రవీంద్ర, ఎడ్ల మాధవరెడ్డి, మంచికలపాటి బాలకోటేసు, శ్రీరామ కుమారస్వామి,జంగిలి థామస్, షేక్ బికారి, గడ్డం విజయ్ కుమార్,జంగిలి ఇస్రాయేలు, ఏం లాజరు, పోకూరి కొండలరావు,మహిళా నాయకులు తలారి ప్రసన్నకుమారి, దేవరకొండ ఆది లక్ష్మి , బిరుదుల సంధ్యారాణి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముందుగా శ్రీ వినాయక స్వామి గుడిలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. పూజారులు హారతి ఇచ్చి ఆశీర్వచనాలు అందించారు. వార్డు నాయకులు గజమాలతో సత్కారం చేసి ఘన స్వాగతం పలికారు.
What's Your Reaction?






