మహిళా సాధికారిత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం

Dec 29, 2023 - 19:44
Dec 29, 2023 - 19:46
 0  149
మహిళా  సాధికారిత   ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం

 మహిళా సాధికారత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యం: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి డిప్యూటీ చైర్పర్సన్ ఆచార్య ఉమామహేశ్వరి 

 జనసాక్షి  :

మహిళా సాధికారత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా మండలి డిప్యూటీ చైర్పర్సన్ ఆచార్య పి. ఉమామహేశ్వరి దేవి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్ స్టడీస్, న్యాయవిభాగం, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక్కరోజు జాతీయ సదస్సును శుక్రవారం సావేరి అతిథిగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వర్చువల్ పద్ధతిలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సంరక్షణ కోసం జననీ సురక్ష యోజన, బంగారు తల్లి వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించాలంటే మహిళల అక్షరాస్య శాతం, ఉద్యోగిత శాతం కూడా పెరగాలని అన్నారు. వర్సిటీ విసి ఆచార్య డి. భారతి మాట్లాడుతూ మహిళలు కుటుంబంలో ప్రధాన పాత్ర పోషిస్తారని, కుటుంబానికి వెన్నెముక లా నిలబడతారని అన్నారు. మహిళలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించి ఆర్థిక అంశాల పైన కూడా దృష్టి సారించాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ రజిని మాట్లాడుతూ మహిళలు కుటుంబ భారము ఉద్యోగ భారంతో సకాలంలో సరైన న్యూట్రిషన్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం లేదని అవగాహనతో మహిళలు వాటిని అధిగమించాలని సూచించారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. మైసూర్ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర విభాగమాచార్యులు ఇందిరా మాట్లాడుతూ మహిళ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తేనే దేశం కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య కే అనురాధ, సదస్సు కన్వీనర్లు డాక్టర్ నీరజ, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ శ్రీ రజిని, , ఆచార్య ఆచార్య సుజాతమ్మ ఆచార్య శారద ఆచార్య సావిత్రి ఆచార్య సీతాకుమారి ఆ ఆచార్య ఆముదవల్లి, ఆచార్య నిర్మల, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow