ఆంధ్రప్రదేశ్ కు నూతన రైల్వే ప్రాజెక్టు లు కేటాయించారా?

Apr 2, 2025 - 18:40
 0  87
ఆంధ్రప్రదేశ్ కు నూతన రైల్వే ప్రాజెక్టు లు కేటాయించారా?

ఆంధ్రప్రదేశ్‌ కు నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కోరారు. ఈ మేరకు లోక్‌సభలో బుధవారం వివిధ అంశాలపై ఆయన ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన, నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల వివరాలు, ప్రస్తుతం వాటి స్థితి తెలియజేయాలన్నారు. అలాగే నూతనంగా కేటాయించబడిన, మంజూరు చేయబడిన, వినియోగించబడిన మొత్తం నిధుల వివరాలు ఆరా తీశారు. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళికలు ఉన్నాయా అని వివరాలు కోరారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్‌ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు రాష్ట్రాలు, జిల్లాలవారీగా ఉండదని, రైల్వే జోన్ల వారీగా ఉంటుందన్నారు. రైల్వే ప్రాజెక్టులు చేపట్టడం అనేది దాని వ్యయం, కనెక్టివిటి, ప్రత్యామ్నాయ మార్గాలు, రద్దీ, మార్గాల పెంపుదల, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పార్లమెంటు సభ్యుడు, ఇతర ప్రజాప్రతినిధులు లేవనెత్తిన డిమాండ్లు, రైల్వే సొంత కార్యాచరణ అవసరాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, నైరుతి రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల పరిధిలోకి వస్తుందన్నారు. రైల్వే జోన్ల వారీగా ప్రాజెక్టుల వివరాలు, వాటి ఖర్చు భారతీయ రైల్వే వెబ్సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ జోన్ల పరిధిలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 01.04.2024 నాటికి, మొత్తం 5,329 కి.మీ పొడవును కవర్ చేస్తూ, 73,743 కోట్ల విలువైన 41 రైల్వే ప్రాజెక్టులు(17 కొత్త లైన్లు మరియు 24 డబ్లింగ్) ప్రణాళిక/ఆమోదం/అమలు దశలో ఉన్నాయన్నారు. వీటిల్లో 1006 కి.మీల పొడవున ₹24,150 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. అలాగే 6764 కి.మీ గల 65 సర్వేలు(13 కొత్త లైన్ మరియు 52 డబ్లింగ్) గత మూడు సంవత్సరాలలో అంటే 2021-22, 2022-23, 2023-24 మరియు ప్రస్తుత సంవత్సరం 2024-25లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్లు చెప్పారు.

2014 నుంచి భారతీయ రైల్వేలకు నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009-2014 మధ్య రైల్వేలకు సంవత్సరానికి రూ.886 కోట్లు కేటాయిస్తే.. 2025-26 సంవత్సరానికే ఆంధ్రప్రదేశ్‌కు రూ.9417 కోట్ల విలువైన ప్రాజెక్టుకు కేటాయించామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, అటవీ క్లియరెన్స్, అనుమతులు, భౌగోళిక పరిస్థితులు, ప్రాజెక్ట్/స్థలం ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితి, పని సమయం, నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం పనిచేసే సమయం వంటి అంశాలు ఇక రైల్వే ప్రాజెక్టుల పూర్తి అనేది ఆధారపడి ఉంటుందన్నారు. వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు జోనల్ రైల్వేలు, ఇండియన్‌ రైల్వే సామాజిక మాధ్యమాల్లో ఉంచబడుతుందన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow