మానవ సేవే మాధవ సేవ

మానవ సేవే మాధవ సేవ అన్నది నానుడి
మరి, మూగజీవులకు చేసే సేవ!
హైదరాబాద్కు చెందిన సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ - వారియర్స్ టీమ్ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మూగజీవులకు అద్భుతమైన సేవలు అందిస్తున్నది. వరద ప్రాంతాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులున్న చోటికి వెతుక్కొంటూ వెళ్ళి, వాటికి ఆహారం పెడుతున్నారు. విషసర్పాలను సహితం సజీవంగా పట్టుకొని దూర ప్రాంతాల్లో వదిలిపెట్టే పని కొందరు చేస్తున్నారు. "సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్" నిర్వహిస్తున్న ఈ మహత్తర సేవా కార్యక్రమంలో నా సతీమణి డాక్టర్ కొల్లి ప్రశాంతి కూడా శనివారం సింగనగర్ ప్రాంతంలో పాల్గొన్నారు.
What's Your Reaction?






