2000 సభ్యత్వ నమోదులు అభినందనీయం

Nov 11, 2024 - 12:26
 0  8
2000 సభ్యత్వ నమోదులు అభినందనీయం
2000 సభ్యత్వ నమోదులు అభినందనీయం
 
ఇందుకూరు పేట మండలం మైపాడు గ్రామంలో అత్యంత వేగంగా దాదాపు 2 వేల టిడిపి సభ్యత్వాలు పూర్తి చేయడం అభినందనీయమని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు. మైపాడులో టిడిపి కార్యకర్తలు దాదాపు 2 వేల సభ్యత్వాలు పూర్తి చేయడంపై నెల్లూరులోని విపిఆర్‌ నివాసంలో ఆదివారం కార్యకర్తలను వేమిరెడ్డి దంపతులు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో ఉన్న ఓటర్లలో 40 శాతం సభ్యత్వాలు పూర్తి చేయడం శుభ పరిణామన్నారు. అందరి సహకారంతో ఇన్ని సభ్యత్వాలు పూర్తి చేయగలిగారని అన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow