రాష్ట్రంలో దళిత, గిరిజన సంక్షేమం, అంబేద్కర్ ఆశయాలను లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న
*'రాష్ట్రంలో దళిత, గిరిజన సంక్షేమం, అంబేద్కర్ ఆశయాలను లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కొనసాగుతోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి 5 ఏళ్లు పట్టించుకోకుండా దళితులను మోసం చేసిన మూర్ఖుడి దగ్గర చేరి మమ్మల్ని తిట్టిస్తారా? దళిత యువకుడికి అన్యాయం జరిగి చనిపోతే మా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత దళిత మహిళను కాలుతో తన్నినా దిక్కులేదు, ఆవు చర్మం కోస్తున్నారన్న కారణంతో ఎస్సీ వర్గానికి చెందిన సొదరులను చెట్టుకి కట్టేసినప్పుడు చంద్రబాబుకి కళ్లు పోయాయా, అయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులే ఎస్సీ వర్గాలకు చెందిన సోదరులను మురికి వాళ్ళు అన్నప్పుడు ఎల్లో మీడియాకు కనిపించలేదా? రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో దళితులపై దారుణాలు, అఘత్యాలు జరిగితే కళ్ళులేని కబోదులైన మీరు ఇప్పుడు చంద్రబాబు వద్ద డబ్బు తీసుకుని మీ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలోని దళితులను తాకట్టు పెట్టడానికి చూస్తున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ భావజాలంతో పని చేస్తున్నట్టువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే. ఈ రాష్ట్రంలో దళితుల కోసం నిరంతరం పనిచేసే కుటుంబం జగనన్న కుటుంబం, సీఎం జగన్ కీ మా దళిత వర్గానికి ఆత్మీయ సంబంధం ఉంది. మీ చంద్రబాబు లాగా దళితులను చిన్న చూపు చూడలేదు. ఈ రోజు ఎవరైతే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తూ మమ్మల్ని తిడుతున్నరో వాళ్ళు చేతనైతే ఆ దళిత కుటుంబానికి సహాయం చేసి అలాగే చంద్రబాబు కొట్టేసిన కోట్ల రూపాయలను దళితులకు పంచాలి" - మంత్రి మేరుగ నాగార్జున*
What's Your Reaction?






