108 ఉద్యోగుల సేవలు మరువలేనివి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

108 ఉద్యోగుల సేవలు మరువలేనివి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
కందుకూరు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆదివారం 108 ఉద్యోగుల జీతం పెంపుదలపై సిబ్బంది అభినందన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 108 సిబ్బంది సేవలు మరువలేనివి, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినవారికి ప్రథమ చికిత్స అందించి వారిని ప్రాణాలను కాపాడటం, సకాలంలో ఆసుపత్రిలో చేర్పించటమే కర్తవ్యం గా పనిచేస్తారని తెలిపారు. 108 సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రజలకు మంచి చేసేలా పని చేయాలని సిబ్బందికి సూచించారు..ప్రజల ఆరోగ్య రక్షణ కొరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో 190 108 వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.గత వైసిపి ప్రభుత్వంలో 108 సిబ్బంది తమ కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచాలని పలుమార్లు ఆందోళన చేసిన పట్టించుకోలేదని, కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార హామీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 108 సిబ్బందికి ₹4,000 జీతాన్ని పెంచిందని ఎమ్మెల్యే తెలియజేశారు..
ఈ సందర్భంగా 108 ఉద్యోగులు మాట్లాడుతూ మా కష్టాన్ని గుర్తించిన మాకు ₹4,000 జీతాన్ని పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు శాసనసభ్యులు *ఇంటూరి నాగేశ్వరరావు* గారికి సిబ్బంది ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక భరోసాతో మరింత ఉత్సాహంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చేస్తామని సిబ్బంది తెలియజేశారు..ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఇంద్రాణి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, హాస్పిటల్ కమిటీ మెంబర్ గడ్డం మాలకొండయ్య, భూషయ్య, శిగా తిరుపాలు, చిలకపాటి మధు, షేక్ రఫీ, చీదేళ్ల వేణుగోపాల్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..
What's Your Reaction?






