వలేటివారిపాలెం మండలంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటన

వలేటివారిపాలెం మండలంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పర్యటన
వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ, అయ్యావారిపల్లి,చుండి అంగన్వాడీ కేంద్రాన్ని, రేషన్ షాప్ లను రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న సరుకులు వివరాలు, రికార్డులను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. కందుకూరు నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది.
What's Your Reaction?






