శ్రీ శ్రీ కళా వేదిక ప్రచార విభాగం కార్యదర్శిగా జయపాల్

శ్రీశ్రీ ప్రచార విభాగం కార్యదర్శిగా...
అరవ జయపాల్
తిరుపతి జనసాక్షి :
అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చేర్మన్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో సాహితీ కళా ఉత్సవాలు డిసెంబర్ నెల 16 ,17 వ తారీకులో నాన్ స్టాప్ గా 24 గంటల సాహితీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం పలువురు కవులు, రచయితలు, జానపద గాయకులు , ఇతర కళాకారులు పాల్గొంటారు. ఇంత పెద్ద కార్యక్రమానికి అరవ జయపాల్ ఆయన నన్ను తిరుపతి జిల్లా నుంచి ప్రచార విభాగం కార్యదర్శిగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ , ఈ కార్యక్రమం కన్వీనర్ అయిన కొల్లి రమావతి నిర్వహణలో నన్ను ఎన్నిక చేసువటాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాను. ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సంస్థ శ్రీశ్రీ కళావేదిక లాంటి సంస్థకు నన్ను ప్రచార విభాగం కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉంది. సమస్త నా యెడల ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక నిర్వర్తిస్తానని హామీ ఇస్తున్నాను.
ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.
What's Your Reaction?






