విజేతను సత్కరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Feb 7, 2025 - 21:51
 0  15
విజేతను సత్కరించిన  ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

విజేతను సత్కరించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 

విజయవాడలోని కృష్ణా నది 1. 5 కిలోమీటర్ల క్రాసింగ్ రాష్ట స్థాయిలో పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచిన నెల్లూరు వాసి తులసి నాగరాజును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు సన్మానించారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాలులో పెన్నా స్విమ్మర్స్ ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో నెల్లూరు వాసికి ద్వితీయ బహుమతి దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మన జిల్లా నుంచి 33 మంది రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలలో పాల్గొనేలా శిక్షణ యిచ్చిన పెన్నా స్విమ్మర్స్ అసోసియషన్ నిర్వాహకులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో నలుబోలు వెంకట రమణా రెడ్డి, నలుబోలు అశోక్ రెడ్డి, నెల్లూరు రమణా త్రీడి, మునగాల నాగేశ్వరరావు, మేకల వెంకటేశ్వర్లు నాయుడు, మోపూరు పెంచలయ్య, కెవి సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow