వరద నీటిలో చెన్నై ఎయిర్ పోర్ట్.
స్తంభించిన చెన్నై నగరం
జనసాక్షి : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండగా.. చెన్నై నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరంలోని సబ్వేలు, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరింది. పలు విమానాలు, రైళ్లను రద్దు చేయగా.. కొన్నింటిని దారిమళ్లించారు. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్నాయి. వీడియోలు వైరల్ అవుతున్నాయి.
What's Your Reaction?






