మైపాడు బీచ్ కు మహర్దశ

మైపాడు బీచ్ కు మహర్దశ
- మైపాడు రోడ్డు ఫోర్ లైన్ విస్తరణ పనుల ప్రారంభం.
- పర్యాటక అభివృద్ధికి మార్గం సుగమం.
- రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి.
- ఫోర్ లైన్ విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలి.
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
జనసాక్షి: ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం మైపాడు సాగర తీరంలో పర్యాటక అభివృద్ధికి కీలక మలుపు అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు . నెల్లూరు మైపాడు మధ్య నిర్మాణం తలపెట్టిన ఫోర్ లైన్ రోడ్డు విస్తరణ పనులను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఇందుకూరుపేట మండలం నరసాపురం వద్ద ఫోర్ లైన్ విస్తరణ పనుల భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ వైపు మంగళ వాయిద్యాలు మరో వైపు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకూరుపేట మండల అభివృద్ధికి మైపాడు రోడ్డు విస్తరణ ఎంతో దోహద పడుతుందన్నారు. మైపాడు బీచ్ సందర్శించే పర్యాటకులకే కాకుండా గంగపట్నం వెళ్లే శ్రీ చాముండేశ్వరి అమ్మవారి భక్తులకు ఈ రోడ్డు తో ఎంతో ప్రయోజనకరంగా ఉం
టుందన్నారు. వందల కొద్ది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే మైపాడు రోడ్డు విస్తరణతో రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా ఈ ప్రాంత రైతాంగం, మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మైపాడు రోడ్డు ఫోర్ లైన్ విస్తరణ పనులకు సంబంధించి సెంట్రల్ రోడ్ అండ్ ఇంఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ద్వారా కేంద్రం నుంచి 48 కోట్ల రూపాయలు నిధులు సాధించడంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పాత్ర అభినందనీయమన్నారు. నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
కోవూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సంబంధించి 64 కోట్ల రూపాయల వ్యయంతో అంచనాలు రూపొందించి ఉన్నామని త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. గత కోనేళ్ళుగా కనీస మెయింటెనెన్స్ లేక డెబ్బదిన్న రహదారుల ప్యాచ్ వర్కులు ప్రభుత్వ పరంగాను కొన్ని అత్యవసరమైన పనులను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేయిస్తున్నామన్నారు. గత ఐదేళ్లుగా కోవూరు నియోజకవర్గ పరిధిలో సాగునీటి కాలువల మరమ్మత్తుల విషయంలో ONM, FDR లాంటి ఒక్క పని జరిగిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మన ప్రభుత్వం అధికారంలోనికి రాగానే నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటి కాలువల మరమత్తులు జరుగుతున్నాయని కొన్ని అత్యవసర సందర్భాలలో రైతుల విజ్ఞప్తి మేరకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేయిస్తున్నామని తెలిపారు. త్వరలో “పల్లె పండుగ” పేరిట జరిగే కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమస్యలను గుర్తించి 15 వ ఆర్ధిక సంఘ నిధులతో గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. రానున్న అయిదేళ్ల కాలంలో ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి సమాంతరంగా సాగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అండగా నిలిచి సంపూర్ణ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట టిడిపి మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, స్థానిక టిడిపి నాయకులు సురేష్ నాయుడు, కొండూరు సుధాకర్ రెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరి కుమార్ రెడ్డి, బిజెపి నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






