నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం

Feb 17, 2025 - 17:56
Feb 17, 2025 - 17:59
 0  101
నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం
నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం
 
నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సీతారామపురం మండలంలోని శ్రీఇష్ట కామేశ్వరీదేవి సమేత ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానానికి రూ. 5 లక్షల విరాళం అందించారు. నెల్లూరు నగరంలోని వి.పి.ఆర్‌ నివాసంలో ఆలయ అర్చకులు చిన్నకాశయ్య, సుబ్బరాయుడు.. వేమిరెడ్డి దంపతులను శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్యాన్నదానానికి వేమిరెడ్డి దంపతులు రూ.5 లక్షల విరాళం అందజేశారు. ఏటా శివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు వేమిరెడ్డి దంపతులు వసతులు కల్పిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 2017లోనే వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వి.పి.ఆర్‌ అమృతధార వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వాటర్‌ ప్లాంట్‌ ఇప్పటికీ నిరంతరాయంగా పనిచేస్తోంది. ఈ సందర్భంగా వేమిరెడ్డి సహాయంపై అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వేమిరెడ్డి దంపతులు సూచించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow