రబీ సీజన్ లో సాగు చేసిన అన్ని పంటలకు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలి

Feb 5, 2025 - 16:03
Feb 5, 2025 - 16:05
 0  22
రబీ సీజన్ లో సాగు చేసిన  అన్ని పంటలకు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలి

వలేటివారిపాలెం జనసాక్షి ఫిబ్రవరి 05:మండలంలోని కలవల్ల గ్రామంలో మండల వ్యవసాయాధికారి ఎం. హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా  హేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ రైతులు అందరూ మీ గ్రామ, రైతు సేవా కేంద్రాలలో సంబధిత గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు ద్వారా రబీ  సీజన్ లో సాగు చేసిన అన్ని పంటలకు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని కోరారు, తద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ద్వారా పంట నష్ట పరిహారం, ఇన్సూరెన్స్,, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమాలు, కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకొనుటకు అవకాశం ఉందని తెలియజేశారు. అనంతరం శనగ పంటను పరిశీలించారు, శనగలో మొదలు కుళ్ళు , వేరు కుళ్ళు తెలుగు ఉన్నదని, దీని నివారణకు తెగుళ్ళు సోకిన పొలాల్లో పంట మార్పిడి (జొన్న, సజ్జ, కొర్ర)చేసుకోవాలని తెలిపారు.ఉదృతి ఎక్కువ కాకుండా ఎకరాకు 200గ్రాములు కార్బన్ డైజిమ్ మరియు 600 గ్రాముల మాన్కోజెబ్ లేదా ట్రైకో డేర్మా విరీడి 5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని సూచించారు . కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పి. శ్రీకాంత్ రెడ్డి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow