మువ్వన్నెల జెండా
మూడు రంగుల జెండా రా
అది ముచ్చటైన జెండా రా
భారత ప్రజల గుండెల నిండుగా
రేపరెపలాడే మువ్వన్నెల జెండా రా
అదే అదే మన జాతీయ జెండా రా
చరణం
సిరి సంపదల నిలయము రా
పవిత్ర నదులు ఉన్న పుణ్య భూమి రా
కర్మభూమిగా కరుణను పంచుతూ
బాసిల్లుతున్న భారత భూమి రా
" పల్లవి!
భిన్నత్వంలో ఏకత్వమై
సర్వ మతాల సమ్మేళనమై
సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా నిలిచింది
నా భారతదేశం
!పల్లవి!
తెల్లదొరలు ఆక్రమించిరి
నా భరత భూమిని....
నేతాజీ,భగత్ సింగ్
అల్లూరి, ఆజాద్ లు
తెల్లవారి దాస్టికాలను
తిప్పి కొట్టిన వీర పుత్రులు
! పల్లవి!
అహింస ఏ ఆయుధంగా
ఆంగ్లేయులను ఎదిరించి
శాంతి మార్గాన స్వాతంత్రం తీసుకొచ్చే మన జాతిపిత గాంధీజీ
ఎందరో అమరుల త్యాగఫలంతో
ఎగురుతుంది నింగి నిండా!
మన పవిత్రమైన జెండా!
అదే మువ్వన్నెల జెండా!
మూడు రంగుల జెండా రా
అదే ముచ్చటైన జెండా రా
భారత ప్రజల ఎద నిండారా
రెపరెపలాడే మువ్వన్నెల జెండారా
అదే అదేమనజాతీయ జెండా రా
డా. పోతుగంటి వీరాచారి
కవి,రచయిత,
సామాజిక కార్యకర్త
సూర్యాపేట-508213
చరవాణి,9666693494