ఎంపీ వేమిరెడ్డి వినతులపై కేంద్ర మంత్రుల సానుకూల స్పందన

Dec 19, 2024 - 16:52
 0  71
ఎంపీ వేమిరెడ్డి వినతులపై కేంద్ర మంత్రుల సానుకూల స్పందన

ఎంపీ వేమిరెడ్డి వినతులపై కేంద్రమంత్రుల సానుకూల స్పందన

  • ఎంపీ విజ్ఞప్తుల పరిష్కారానికి కృషి చేయాలని ఆయా అధికారులకు ఆదేశాలు-
  • ఈ మేరకు లేఖలు విడుదల చేసిన ఆయా మంత్రులు

జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలపై వారు సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఎంపీ గారు.. జిల్లాలో సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆయా శాఖల పరిధిలో ప్రజలకు అందాల్సిన సేవలు, ఏర్పాటు చేయాల్సిన వసతులు, సమస్యలను మంత్రులకు వివరించారు. 

విడవలూరు మండలం పొన్నపూడి పాటూరులో ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటు కోరుతూ కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ను కలిసి ఎంపీ వినతి పత్రం అందించారు. అలాగే ఓబీసీ లబ్ధిదారులకు ప్రధానమంత్రి మత్య్స సంపద యోజన కింద ఇస్తున్న డీప్‌సీ బోట్లకు సబ్సిడీని పెంచాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. ఎంపీ గారు దృష్టికి తెచ్చిన సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే నెల్లూరులో ఈఎస్‌ఐ ఏర్పాటు చేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కోరగా.. కేంద్ర లేబర్‌, ఎంప్లాయ్‌మెంట్‌, యూత్‌ మినిస్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ గారు స్పందిస్తూ.. ఎంపీ గారి వినతిని పరిశీలించి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇక సంగం మండలం చిరమణ పిన్‌కోడ్‌ 524308ను మార్చి ఏఎస్‌పేట మండలం పరిధిలోకి తీసుకువెళ్లి 524304 పిన్‌ కోడ్‌ కేటాయిస్తూ తీసుకుంటున్న నిర్ణయంపై గ్రామస్థులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారిని కలిశారు. పిన్‌కోడ్‌ మార్చితే తాము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో చిరమణ పిన్‌కోడ్‌ 524308ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవాలని ఎంపీ గారు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్‌రెడ్డిగారి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో కేంద్రమంత్రి స్పందిస్తూ.. చిరమణకు 524308ను కొనసాగిస్తూ సంగంలోనే ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేశారు.

అలాగే కందుకూరులో నిరుపయోగంగా ఉన్న ఖాదీ కార్యాలయం స్థానంలో స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ ఏర్పాటు కోరుతూ ఎంపీ గారు.. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి జితిన్‌రామ్‌ మాంఝీకి విన్నవించారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు మంత్రి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ లేఖ విడుదల చేశారు. దాంతో పాటు బిట్రగుంట రైల్వే అభివృద్ధితో పాటు వివిధ సమస్యలను ఎంపీ వేమిరెడ్డి రైల్వేశాఖమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన స్పందిస్తూ ఎంపీ గారి వినతులను పరిశీలించి, బిట్రగుంటలో రైల్వే అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఆరా తీయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow