అధికారంలోనికి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో అనారోగ్య పీడితులకు 5 సార్లు ముఖ్యమంత్రి సహాయనిధి అందచేసిన ఘనత సిఎం చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారువేమిరెడ్డి దంపతులు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి చెందిన కోలమ్మల శ్రీనివాసులు కు 3 లక్షల 90 వేళా 890 రూపాయలు, ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామానికి చెందిన చెముడుగుంట అవినాష్ కు 2 లక్షల 13 వేల 640 రూపాయలు, కొడవలూరు మండలం మిక్కిలింపేటకు చెందిన బడుగు జస్మిత కు 2 లక్షల 29 వేలు, విడవలూరు మండలం వడ్డిపాళెం వాసి బెల్లంకొండ అరుణకు 1 లక్షా 72 వేల 575 రూపాయలు, విడవలూరు మండలం అలగానిపాడు గ్రామానికి చెందిన పొనుగంటి సుధాకర్ కు 1 లక్ష 61 వేల 085 రూపాయలు, కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం గ్రామానికి చెందిన వడియార ప్రార్ధ సారధి కు 1 లక్ష 54 వేల 838 రూపాయలు, కోవూరు మండలం పాటూరు వాసి నెల్లూరు నాగేంద్ర కు 1 లక్ష 54 వేల 217 రూపాయాలు, కోవూరు మండలం జమ్మిపాళెం వాసి వేములచేడు దయాకర్ కు 1 లక్ష 36 వేల 841 రూపాయలు, విడవలూరు మండలం రామతీర్ధం వాసి పూడి రమేష్ కు 87 వేళా 103 రూపాయలు, ఇందుకూరుపేట మండలం పున్నూరుకు చెందిన బాలబొమ్ము వెంకట శేషయ్య కు 2100 వేల రూపాయల ముఖ్యమంత్రి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు 5 విడతలుగా 45 లక్షల 89 వేల 334 రూపాయల చెక్కులు పంపిణి చేసినట్లు వివరించారు. అనారోగ్య బాధితులకు సిఎంఆర్ ఎఫ్ చెక్కులు అందచేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ జెడ్ పి ఛైర్మన్ చెంచల బాబు యాదవ్, ఇందుకూరు పేట టిడిపి అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, విడవలూరు టిడిపి ఇంచార్జి అడపాల శ్రీధర్ రెడ్డి, యువ నాయకులు బెజవాడ వంశీ రెడ్డి, బుచ్చిరెడ్డి పాళెం టిడిపి ఇంచార్జి అడపాల అనీష్ రెడ్డి టిడిపి నాయకులు ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు.