శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ సమస్య వివరాలు ఇవీ
జనసాక్షి : ఉద్ధానం కిడ్నీ బాధితుతుల సమస్య రాష్ర్టంలో ప్రతి రాజకీయ పార్టీకి, నేతలకు తెలిసిన పరిష్కారించని సమస్య. ప్రతి ఎన్నికల్లో విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితమయ్యే ఈ ఉద్ధానం కిడ్నీ సమస్య దశాబ్ధాలుగా సమస్యగానే ఉండిపోయింది. ఏళ్లుగా పరిష్కారం కాని ఉద్ధానం కిడ్నీ సమస్యకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పరిష్కారం లభించింది. సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించి ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపించారు. కిడ్నీ బాధితుల కోసం డా. వైఎస్సార్ కిడ్నీ రీసర్చ్ సెంటర్ ను నిర్మించారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ సమస్య వివరాలు ఇవీ..
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య కల్లోలం సృష్టిస్తోంది. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అంచనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి.
రక్తంలో సీరం క్రియాటిన్ 1.2 మిల్లీగ్రామ్/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం. కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చాలామందిలో 25 మిల్లీగ్రామ్/డెసీలీటర్ మేరకు ఉంది. క్రియాటినిన్ 5 దాటితే డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు. అయినా ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టించుకోలేదు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలు..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడిన సీరం క్రియాటిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.10వేలు చొప్పున 792 మందికి.. రూ.5 వేలు చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు.
- సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్‌లో 13 పడకలుండేవి. వాటిని 21కి పెంచారు.
- కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్‌లో 10 పడకలు ఉండగా, 19కి పెంచారు.
- హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేశారు. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్విసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు.
- ఇవికాక.. కొత్తగా గోవిందపురం, కంచిలి, అక్కుపల్లి, బెలగాంలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి.
- ఇచ్ఛాపురం సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్‌సీలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి చ్చింది.
- టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
- కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు.
- కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్‌ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ ఉద్దానం ప్రాంతంలోని 2.32లక్షల మందిని స్క్రీన్ చేయగా 19,532 మందిలో సీరమ్ క్రియాటిన్ 1.5 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ వైద్య సాయం అందించారు.
- టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్‌లోనెఫ్రాలజీ విభాగం ఏర్పాటుచేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు.
- కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం రూ.85 కోట్ల అంచనాలతో పలాసాలో రీసెర్చ్ సెంటర్‌తోపాటు 200 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి, రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు కేటాయించారు.
What's Your Reaction?






