ప్రకాశం జిల్లా ముండ్లమూరులో భూ ప్రకంపనాలు

ముండ్లమూరులో భూ ప్రకంపనాలు
-బీతిల్లిన ప్రజలు
గోడలకు నెర్రలు ఇవ్వడంతో ఆందోళనలో ప్రజలు
జనసాక్షి ముండ్లమూరు: మండల కేంద్రమైన ముండ్లమూరు తో పాటు ముండ్లమూరు, పసుపుగల్లు. చింతలపూడి, వేముల బండ, ఈదర, ఉమామహేశ్వరపురం, పూరి మెట్ల, భీమవరం, అయోధ్య నగర్, రమణారెడ్డి పాలెం, వేముల తదితర గ్రామాలలో శనివారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10:35కు ఒక్కసారిగా భూమి పెద్ద శబ్దంతో కంపించడంతో గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో ఇండ్లలోంచి వంట సామాన్లు కింద పడ్డాయి. కొన్నిచోట్ల గోడలకు నెర్రెలు ఇవ్వడంతో ఆందోళన చెందారు. తరచూ ఈ విధమైన భూమి కనిపించడం పలుసార్లు చోటుచేసు కొన్న ఇంత పెద్ద శబ్దంతో ఈ ప్రాంతంలో భూమి కం పించడంతో ఆందోళన చెందారు. కొన్ని సెకన్ల పాటు భూమి కం పంపించడంతో రోడ్ల మీదకి ప్రజలు పరుగులు తీశారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ప్రహరీ గోడలకు నేరలిచ్చాయి ఎప్పుడూ కని విరగని రీతిలో ఎంత తీవ్రంగా రావడం ఇదే మొదటిసారి అని ప్రజలు అంటున్నారు.
What's Your Reaction?






