దామల చెరువులో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం

మేమంతా సిద్ధం డే7 అప్డేట్స్
మేమంతా సిద్దం యాత్ర 7వ రోజు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. వాడవాడల సీఎం జగన్కు స్థానికులు స్వాగతం పలికారు. చిన్న, పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరు సీఎం జగన్ పై ప్రేమ చూపిస్తు జేజేలు కొట్టారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సదుం సర్కిల్ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం.
అనంతరం గొడ్లవారిపల్లి బస్టాప్ సమీపంలో పింఛన్ దారులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రస్తుతం కల్లూరు గ్రామంలోకి సాగుతున్న యాత్ర, అక్కడి స్థానికులు తమదైన శైలిలో సీఎం జగన్కు స్వాగతం పలుకారు.
దామలచెరువులో సీఎం జగన్కు అపూర్వ స్వాగతం
- చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర
- వేలాదిగా తరలి వచ్చిన జన ప్రభంజనం
- సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం
What's Your Reaction?






