బీసీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

Dec 16, 2024 - 09:26
 0  11
బీసీ హాస్టల్లో  సీసీ కెమెరాలు ఏర్పాటు

బీసీ హాస్టళ్లో సీసీ కెమెరాల ఏర్పా

తిరుపతి, డిసెంబర్ 15 : బీసీ హాస్టళ్ల విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి హాస్టళ్లోనూ, గురుకుల పాఠశాలల్లోనూ ఇన్వర్టర్లతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మాత్యులు ఎస్.సవిత స్పష్టంచేశారు. ఆదివారం నగరంలోని బీసీ బాలిక హాస్టల్ ను సందర్శించారు. హాస్టల్లో ప్రతి గదిని, బాత్ రూమ్ లను, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.39 వేల కోట్లకు పైగా కేటాయించామన్నారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా బీసీల అభ్యున్నతికి అత్యధిక నిధులు కేటాయించామన్నారు. అందులో భాగంగా బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.25 కోట్లు కేటాయించామన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థులకు భద్రతతో కూడిన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యంగా నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండేలా హాస్టళ్లలలో ఇన్వర్టర్లతో పాటు విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణంతో పాటు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే తమ పిల్లలను బీసీ హాస్టళ్లకు పంపుతున్నారో...అదే భరోసాతో విద్యార్థులను కంటకి రెప్పలా కాపాడుతున్నామన్నారు. 

-26 జిల్లాల్లోనూ బీసీ భవనాల నిర్మాణం

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ బీసీ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బీసీ భవన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ భవనాలన్నీ 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయన్నారు. తరవాత వచ్చిన జగన్ ఆ నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవన్లతో పాటు కొత్త జిల్లాల్లోనూ నూతన భవనాలు నిర్మించనున్నామన్నారు. గత ప్రభుత్వం బీసీ హాస్టళ్లను కూడా గాలి కొదిలేశారన్నారు. హాస్టళ్ల మరమ్మతులకు రూపాయి కూడా నిధులివ్వలేదని, చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని అన్నారు. రంగుల రెడ్డికి భవనాలకు రంగుల వేయడంపై ఉన్న శ్రద్ధ హాస్టళ్ల నిర్వహణపై చూపలేదని జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్ భవనాలకు రంగు మార్చో...పేరు మార్చో...నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే బీసీ విద్యార్థులకు ఎంతో మేలు కలిగేదన్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow