పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవు

సింగరాయకొండ జనసాక్షి :
పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కిస్తే చట్టపరమైన చర్యలు తప్పవ సింగరాయకొండ ఎస్సై బి. మహేంద్ర హెచ్చరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై తరచూ ఆటో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనీ, దానికి ప్రధాన కారణం పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లడమేనని ఆయన స్పష్టం చేశారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఆటో చోదకులు, యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాణం విలువను గుర్తించి నిబంధనలకు లోబడి ఆటోలు నడపాలని సూచించారు.ఆటోల్లో ప్రయాణీకుల భద్రతను కాపాడడం ప్రతి ఆటో యజమాని బాధ్యత అని, వాహనాల వెనుకభాగం మూసేయకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారికి తగిన బుద్ధి చెప్పడంలో పోలీసులు వెనుకాడరని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో చోదకులు, ప్రయాణీకులు, పాదచారుల సహకారం ఎంతో అవసరమని, అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
What's Your Reaction?






