వరద బాధితుల సహాయార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సీఎం సహాయ నిధికి విరాళం

వరద బాధితుల సహాయార్ధం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, పెన్షనర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుని ఉండవల్లి నివాసంలో శనివారం కలిసి ఉద్యోగుల తరపున రూ.1,18,36,798, పెన్షనర్స్ తరపున రూ.71.59 లక్షల చెక్కును విరాళంగా అందించారు. వీరిని సీఎం అభినందించారు. అంతకముందు టీటీడీ అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
What's Your Reaction?






