నెల్లూరు జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం

నెల్లూరు జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖమంత్రి జ్యోతిరాధిత్య సిండియా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాస్థాయిలో టెలికం అడ్వైజరీ కమిటీ ఏర్పాటుకు వివిధ నియోజకవర్గాల నుంచి పలువురి పేర్లను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులకు కేంద్ర మంత్రి ఆమోదం తెలుపుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. టెలికం అడ్వైజరీ కమిటీకి ఎంపీ వేమిరెడ్డి గారు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి చెందిన కటారి రమణయ్య, కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలేనికి చెందిన గుర్రం మాల్యాద్రి, నెల్లూరు రూరల్, శ్రీహరి నగర్‌కు చెందిన బొప్పూరు ప్రసాద్, కావలి నియోజకవర్గానికి చెందిన కుట్టుబోయిన బ్రహ్మానందం, నెల్లూరు సిటీకి చెందిన ఏటూరి రమేష్ బాబు, కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటకు చెందిన ముంగర గోపాల్, ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలానికి చెందిన తాటికొండ అనూష, నెల్లూరు రూరల్ కు చెందిన వేదనపర్తి సురేంద్ర రెడ్డిగారు ఎంపికయ్యారు. టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఎన్నికవడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ సహకారంతో జిల్లాలో టెలికం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
What's Your Reaction?






