తిరుమల శ్రీవారిని దర్శించుకున్నరాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్

Dec 19, 2023 - 17:34
 0  12
1 / 1

1.

  జనసాక్షి :- తిరుమల శ్రీవారిని మంగ‌ళ‌వారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో  శ్రీ ఎవి.ధర్మారెడ్డి అహ్వానించగా, అర్చక బృందం ''ఇస్తికఫాల్‌'' ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో  గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మ‌న్‌, ఈవో తీర్థప్రసాదాలు,శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, విజివో శ్రీ నంద‌కిషోర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow