ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన గుర్రం శింగయ్య

1.
జనసాక్షి:- కందుకూరు, పట్టణంలో ప్రముఖ ఆర్యవైశ్యులు వైయస్సార్ సీపీ నాయకుడు గుర్రం శింగయ్యకు రాష్ట్ర వైయస్సార్ సీ పీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడిన సందర్భంగా కందుకూరు పట్టణ వైయస్సార్ సీపీ కార్యాలయములో శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ గుర్రం సింగయ్య గారి కుటుంబానికి మా కుటుంబాని కి మొదటినుంచి సంబంధాలు ఉన్నాయని, శింగయ్య గారి తండ్రికి మా తండ్రికి మంచి సంబంధాలు ఉన్నాయని, అదే సంబంధం నేడు కూడా కొనసాగుతుందని అన్నారు. వైయస్సార్ సీపీ వాణిజ్య విభాగంలో శింగయ్య కు సముచిత స్థానం లభించిందని అన్నారు. నిబద్ధతతో పనిచేసే ఆ పదవికి వన్నె తేవాలని ఎమ్మెల్యే సూచించారు . శింగయ్య మాట్లాడుతూ తనకి పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డికి, శాసనసభ్యులు మహీధర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. తన వెంట వచ్చిన నగర ఆర్యవైశ్య నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురారి శెట్టి వెంకట సుబ్బారావు, మురారి శెట్టి శ్రీకాంత్ , శ్రీను, కందగడ్ల వెంకటేశ్వర్లు, కోట నరసింహం,
What's Your Reaction?






