టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కులపై వెబినార్

Feb 11, 2025 - 15:55
Feb 11, 2025 - 15:57
 0  10
1 / 1

1.

టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కులపై వెబినార్

కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోలో(స్వయం ప్రతిపత్తి), నాణ్యత ప్రమాణాలలో భాగంగా ఐక్యుఏసి విభాగం ఆధ్వర్యంలో మేధో సంపత్తి హక్కులు, పేటెంట్లు, డిజైన్ ఫైలింగ్ అనే అంశంపై ఆన్లైన్ వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగపూర్ లోని రాజీవ్ గాంధీ జాతీయ మేధో సంపత్తి హక్కుల నిర్వహణ సంస్థలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ గా పనిచేస్తున్న  కుమార్ రాజు హాజరై ఉపన్యసించారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రవికుమార్ ప్రారంభించి, ఇటువంటి కార్యక్రమాలు కళాశాల నాణ్యత ప్రమాణాలను పెంచడమే కాకుండా, విద్యార్థులలో అవగాహన,  జిజ్ఞాసను కలిగిస్తాయని పేర్కొన్నారు. వక్త కుమార్ రాజు మాట్లాడుతూ మేధో సంపత్తి వలన వస్తువులను తయారు చేసి, వాటికి పేటెంట్లు తీసుకోవడం వల్ల ఆ మేధోసంపత్తి వస్తువు తయారు చేసిన వారికే సొంతం అవుతుందని, ఆ వస్తువును వారు మాత్రమే 20 సంవత్సరాల పాటు ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. భౌగోళిక గుర్తింపు గురించి మాట్లాడుతూ ఏదైనా వస్తువు భౌగోళిక గుర్తింపు పొందితే ఆ వస్తువుకు స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా ఒక ప్రాంతంలో తయారయ్యే వస్తువు ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని, ఆ వస్తువును ఉత్పత్తి చేసే శ్రామికులకు ఆదాయం పెరుగుతుందని తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్థులు సృజనాత్మకతతో వస్తువులను తయారు చేస్తే, వాటికి డిజైన్ ఫైలింగ్ చేసి, పేటెంట్ పొందాలని సూచించారు. కార్యక్రమం చివరలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం వల్ల ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి,  వెబినార్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రాజగోపాల్ బాబు, కోటపాటి నరేష్ రాజా, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు నరేంద్ర, అకడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్వి శ్రీహరి ,కళాశాల అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow