క్రీడా ప్రతిభను ప్రోత్సహించే పత కాలు

క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తేనే పతకాలు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జిల్లా క్రీడాకారులకు సంబంధించి కల్పించాల్సిన వసతులపై లోక్‌సభలో మాట్లాడారు. మంగళవారం లోక్‌సభలో జీవో అవర్ సందర్భంగా పలు అంశాలను సభ ముందుకు తెచ్చారు. నెల్లూరు జిల్లాలోని మొగళ్లపాలెం వల్ల నిర్మించిన మల్టీపర్సస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్‌ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
క్రీడలు దేశ సమగ్ర అభివృద్ధి, వ్యక్తి వికాసంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయని ఎంపీ వేమిరెడ్డి అన్నారు. దేశం గత కొన్నేళ్లుగా క్రీడల్లో స్థిరమైన పురోగతి సాధిస్తోందని, ఇటీవలి ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. 2036 ఒలింపిక్స్ కోసం కేంద్ర బిడ్డింగ్ వేస్తున్నందుకు సంతోషిస్తూ..దానికి అనుగుణంగా యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో క్రీడలను ప్రోత్సహించడంలో ఖేలో ఇండియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని, కేంద్ర బడ్జెట్‌లో రూ.9000 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
అయితే ఖేలో ఇండియా పథకం కింద నెల్లూరు జిల్లా మొగళ్లపాలెం వద్ద మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగిందని, ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్ లేకపోవడం వల్ల యువ అథ్లెట్లు ప్రాక్టీస్ చేయడానికి, ప్రతిభను, సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.ఈ నేపథ్యంలో మొగళ్లపాలెం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్ (8 లేన్) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు తగిన ప్రతిపాదనలు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు సమర్పించామన్నారు. వీలైనంత త్వరగా ట్రాక్ మంజూరు చేయాలని సంబంధిత మంత్రికి సభాపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?






