శ్రీ రతన్ టాటా కు క్యాబినెట్ నివాళి

Oct 10, 2024 - 14:20
Oct 10, 2024 - 14:25
 0  138
శ్రీ రతన్ టాటా కు  క్యాబినెట్   నివాళి

శ్రీ రతన్ టాటాకు క్యాబినెట్ నివాళి

రతన్ టాటా మృతి దేశానికే తీరని లోటన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి జనసాక్షి  :  దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఎపి క్యాబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా...ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషన్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా క్యాబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబై బయలుదేరి వెళ్లారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow